గ్రీన్ ఛాలెంజ్ ..మొక్కలు నాటిన నటుడు శాయాజి షిండే

313
Shindey

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఈ గ్రీన్ ఛాలెంజ్ విస్తరించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గోని మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు.

తాజాగా నటుడు శాయాజి షిండే ఈ గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించారు. ముంబైలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించినట్లు ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు శుభాకాకాంక్షాలు తెలిపారు. పర్యావరణంలో చెట్లు చాలా అవసరమని..ప్రతి ఒక్కరు తప్పకుండా చెట్లను నాటాలన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో తనను భాగస్వామ్యం చేసిందుకు ధన్యవాదాలు తెలిపారు.