మహారాష్ట్రలో జూలై31వరకు లాక్ డౌన్

213
lockdown
- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో రోజుకి వేల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కలెక్టర్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది.

ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను బట్టి ఆంక్షలను విధించాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం కాని కార్యకలాపాలను కట్టడి చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,64,626 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 86,575 మంది కోలుకోగా..7,429 మంది మరణించారు.

- Advertisement -