శివసేన పార్టీలో ఉద్ధవ్ థాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య నెలకొన్న వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమకోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పనుంది.
అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత సుప్రీంను ఆశ్రయించారు ఏక్నాథ్ షిండే. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ఉద్ధవ్ థాక్రే వర్గం. 2022 ఆగస్టులో కేసును రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది నాటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.
Also Read:ఎగ్జిట్ పోల్స్ : సంచలనం.. విజయం ఆ పార్టీదే !
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పొందుపర్చిన అనర్హత అంశాలతో పాటు ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 సహా అనేక రాజ్యాంగపరమైన అంశాలపై సుదీర్ఘ వాదనలు విన్నది న్యాయస్థానం.స్పీకర్ను తొలగించాలంటూ ఒక పిటిషన్ పెండింగులో ఉండగా, ఆ స్పీకర్ అనర్హత అంశాలపై నిర్ణయం తీసుకోవడం కుదరదు అని వాదించింది షిండే వర్గం. నబం రెబియా కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిందని వెల్లడించింది.
Also Read:IPL 2023:ఢిల్లీపై చెన్నై ఘన విజయం
సుప్రీంకోర్టులో కేసుపై విచారణ కొనసాగుతుండగానే ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ తేల్చింది కేంద్ర ఎన్నికల సంఘం.ఉద్ధవ్ థాక్రే తరఫున వాదనలు వినిపించారు ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, దేవదత్ కామత్. షిండే వర్గం తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, హరీశ్ సాల్వే, మహేశ్ జెఠ్మలానీ, మనీందర్ సింగ్. మహారాష్ట్ర గవర్నర్ తరఫున వాదనలు వినిపించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.