అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు..సుప్రీం ఓకే

118
supreme court
- Advertisement -

అగ్రవర్ణాల్లోని పేదల కోసం కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల విషయంలో దాఖలైన పిటిషన్‌ను ఇవాళ విచారించిన న్యాయస్ధానం…ఈ మేరకు తీర్పును వెలువరించింది. చీఫ్ జ‌స్టిస్ యూయూ ల‌లిత్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నంలో జ‌స్టిస్ దినేశ్ మ‌హేశ్వ‌రి, బేలా ఎం త్రివేది, జేబీ ప‌ర్దివాలాలు ఈడ‌బ్ల్యూఎస్ కోటాను సమర్ధించగా లలిత్ , జ‌స్టిస్ ర‌వీంద్ర భ‌ట్ కోటాను వ్య‌తిరేకించారు.

దీంతో 3-2 తేడాతో పిటిష‌న్‌ను కొట్టివేశారు. రాజ్యాంగంలోని 103వ స‌వ‌ర‌ణ‌ను సుప్రీం స్వాగ‌తించింది. విద్యా సంస్థ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో కోటా అమ‌లుకు సుప్రీం ప‌చ్చ‌జెండా ఊపింది.

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు కోటా ఇవ్వ‌డం చ‌ట్ట వ్య‌త‌రేకం కాద‌ని, రాజ్యాంగం క‌ల్పించిన 50 శాతం సీలింగ్ ప‌రిమితిని కూడా ఉల్లంఘించ‌డం లేద‌ని కోర్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -