- Advertisement -
బ్యాంకులకు వేల కోట్ల ఎగ్గొట్టిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు షాకిచ్చింది సుప్రీం కోర్టు. వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
- Advertisement -