కేజ్రీవాల్‌కు షాకిచ్చిన సుప్రీం..

12
- Advertisement -

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చింది సుప్రీం కోర్టు. లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు కేజ్రీవాల్. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్.

అయితే కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని స్పష్టం చేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌ ఇదివరకే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని తెలిపింది.

లిక్కర్‌ పాలసీ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మే 10న కేజ్రీవాల్‌కు న్యాయస్థానం జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Also Read:Pushpa 2:సెకండ్ సాంగ్ వచ్చేసింది

- Advertisement -