దేశంలో ఫ్రీబీస్‌ చెక్‌ పెట్టే దిశగా… సుప్రీంకోర్టు!

100
supreme
- Advertisement -

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత ప్రకటనలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ప్రజా నిధి నుండి ఉచితాలను వాగ్దానం చేయడానికి, రాజకీయ పార్టీల నమోదును రద్దు చేయడానికి లేదా అలా చేసే పార్టీల ఎన్నికల చిహ్నాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఉచితాలను ప్రకటించే రాజకీయ పార్టీలను అనుమతించవద్దని భారత ఎన్నికల కమిషన్ ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉచితాలను నియంత్రించే అధికారం తమకు లేదని, ఉచితాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయో లేదో ఓటర్లు నిర్ణయించుకోవాలని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొందని పిటిషనర్‌ అశ్విని ఉపాధ్యాయ పేర్కోన్నారు.

సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పార్టీల ఉచిత ప్రకటనలను నియంత్రించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ఎన్నికల సంఘం ఎలా చేతులు ఎత్తేస్తుందని ప్రశ్నించింది. ఎన్నిక‌ల హామీల‌కు సంబంధించిన నిబంధ‌న‌లు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలో ఉన్నాయ‌ని, ఉచితాల‌పై నిషేధం విధించే చ‌ట్టాన్ని ప్ర‌భుత్వ‌మే తీసుకురావాల్సి ఉంటుంద‌ని ఈసీ త‌ర‌పున హాజ‌రైన న్యాయ‌వాది కోర్టుకు నివేదించారు. ఎన్నిక‌ల మ్యానిఫెస్టో ఎలాంటి వాగ్ధానం కాద‌ని గ‌తంలో సుప్రీంకోర్టు వెలువ‌రించిన తీర్పులున్నాయ‌ని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

ఎన్నిక‌ల్లో ఉచిత హామీల‌పై ఈసీనే ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కేఎం న‌ట‌రాజ్ పేర్కొన్నారు. ఈ విష‌యంలో త‌మ‌కు అధికారం లేద‌ని, ఈసీనే ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని మీరు లిఖిత‌ పూర్వ‌కంగా ఎందుకు ఇవ్వ‌కూడ‌ద‌ని న‌ట‌రాజ్‌ను ఉద్దేశించి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ కోరారు. ఉచితాల‌పై ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని తెలిపితే వీటిని కొన‌సాగించాలా లేదా అనేది తాము నిర్ణ‌యిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఉచితాల‌పై హామీల వ‌ర్షం గుప్పించి ప‌త‌న‌మైన శ్రీలంక సంక్షోభం దిశ‌గా మ‌నం ప‌య‌నిస్తున్నామ‌ని, మ‌న ఆర్ధిక వ్య‌వ‌స్ధ కూడా కుప్ప‌కూలుతుంద‌ని ఈ అంశ‌ంపై పిటిష‌న్ దాఖ‌లు చేసిన న్యాయ‌వాది అశ్వ‌ని ఉపాధ్యాయ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు క‌లిపి రూ . 70 ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయ‌ని వివ‌రించారు.

- Advertisement -