దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల విడుదలపై సూప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో 11మంది నిందితుల రిలీజ్ అంశాన్ని విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. నిందితుల రిలీజ్‌ను రద్దు చేయాలని కోరుతూ మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవత్ లౌల్, రూపా రేఖావర్మలు సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ ఆద్వర్యంలోని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనున్నది. అయితే బిల్కిస్ బానో తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ అడ్వకేట్ అపర్ణా భట్ కేసును వాదించనున్నారు.
2002లో గోద్రా అల్లర్ల నేపథ్యంలో బిల్కిస్ బానో రేప్ ఉదంతం జరిగింది. 2008లో ముంబైలోని సీబీఐ కోర్ట్ 11మంది నిందితులకు జీవితఖైదు శిక్షను ఖరారు చేసింది. జైలు నుంచి రిలీజైన వారిలో జశ్వంత్ భాయ్ నాహి, గోవింద భాయ్ నాహి, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహనియా, ప్రదీప్ మోర్దియా, బకాభాయ్ వోహనియా, రాజుభాయ్ సోని, మితేష్ భట్, రమేశ్ చందన్ ఉన్నారు.