- Advertisement -
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ ఇందు మల్హోత్రా,జస్టిస్ షాతో కూడిన ధర్మాసనం ముందు రవిప్రకాష్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు.
టీవీ9 నడవకుండా రవి ప్రకాష్ ఇబ్బంది పెట్టారని జస్టిస్ మల్హోత్రా అభిప్రాయపడగా హైకోర్టు ఈ కేసులో మెరిట్ గురించి మాట్లాడలేదని జస్టిస్ షా వ్యాఖ్యానించారు.ఈ కేసులో రవిప్రకాష్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని మెరిట్‌పై కేసు డిసైడ్ చేయాలని హైకోర్టును కోరుతామన్నారు. కేసు పరిశీలన చేసి హైకోర్టు రిజర్వు రిజక్ట్ కూడా చేయవదచ్చని తెలిపారు.
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేయాలని ధర్మాసనం తెలిపింది. జూన్ 10న విచారణ చేయాలని సూచించింది. ఇక ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -