బీఎస్-4 వాహనాలకు మార్చి 31 డెడ్ లైన్ పొడ‌గింపు

164
supreme
- Advertisement -

మ‌ర్చి 31త‌ర్వాత బీఎస్-4 వాహనాలను విక్ర‌యించ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు సూచించ‌న సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది సుప్రీం. మార్చి 31 డెడ్ లైన్ ను తొలగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఎప్రిల్ 14 త‌ర్వాత మ‌రో 10 రోజులు వాహ‌నాల‌ను విక్ర‌యించుకోవ‌చ్చ‌ని తెలిపింది.

ఇండియాలో లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా, ఆఫర్లు కొనసాగుతున్నా, డీలర్లు వాహనాలను విక్రయించుకునే పరిస్థితి లేదని, కాబట్టి, డెడ్ లైన్ ను తొలగించాలని ఎఫ్ఏడీఏ (ది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్), సియామ్ (సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్)లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.తమ వద్ద 12 వేలకు పైగా కమర్షియల్ వాహనాలు, 15 వేలకుపైగా పాసింజర్ కార్లు, 7 లక్షల ద్విచక్ర వాహనాల స్టాక్ మిగిలిపోయిందని, మార్చి 31 లోగా వీటి డిస్పాచ్ అసంభవమని సియామ్, ఎఫ్ఏడీఏలు చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.

- Advertisement -