పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌..

176
- Advertisement -

సినిమానే ఆయన ప్రపంచం..సినిమాను నిలబెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నం లేదు. మూడు షిఫ్ట్‌ల్లో పనిచేసి సినిమా పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్న గొప్పవ్యక్తి. అందుకే ఆయన సూపర్‌ స్టార్ అయ్యారు. సినీ వినీలాకాశంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ. అందుకే ఆయన లేరన్న వార్తను సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది.

ఎన్నో ప్రయోగాత్మక, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కౌబాయ్ తరహా చిత్రాలను టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 50 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమాను మనకు పరిచయం చేశారు. హాలీవుడ్ సినిమాల స్పూర్తితో 1971లో మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమాను రూపొందించారు.

ఈ సినిమా తమిళ్ తో పాటుగా హిందీలో ఖజానా , ఇంగ్లీష్ లో ది ట్రెజర్ టైటిళ్లతో రిలీజై సూపర్ హిట్అయింది. అప్పట్లోనే 125 దేశాల్లో రిలీజైన తొలి భారతీయ సినిమాగా మోసగాళ్లకు మోసగాడు. కృష్ణ సరసన విజయనిర్మల హీరోయిన్ గా నటించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -