చెన్నై దూకుడుకి బ్రేకులు వేసిన సన్ రైజర్స్

259
SRH
- Advertisement -

ఐపిఎల్ 2019 సీజన్ లో వరుస మ్యాచ్ లలో విజయం సాధిస్తూ పాయింట్ల పట్టికలో మొదటి స్ధానంలో ఉంది చైన్నై సూపర్ కింగ్స్.. దూకుడు మీదున్న చైన్నైకి బ్రేకులు వేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. నిన్న హైదరాబాద్ వేదికగా చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణిత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133పరుగలు మాత్రమే చేసింది. అద్భుతమైన బౌలింగ్ తో చెన్నై ఆటగాళ్లును ముచ్చెమటలు పట్టించారు హైదరాబాద్ బౌలర్లు.

ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లిసస్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ కలిసి 9.5 ఓవర్లలో 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షేన్ వాట్సన్ 29బంతుల్లో 31పరుగులు చేయగా, డూప్లిసిస్ 31బంతుల్లో 45పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సురేష్ రైనా 13పరుగుల వద్దే అవుట్ కాగా అంబటి రాయుడు 25పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 133పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఇంకా 4ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో లు అద్భుతంగా ఆడారు.

డేవిడ్ వార్నర్ 25 బంతుల్లోనే 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, బెయిర్ స్టో 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన కేన్ విలియంసన్ 3 పరుగులు, విజయ్ శంకర్ 7 పరుగులు, దీపక్ హుడా 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. తన అద్భుతమైన ఆటలో కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ కు అండగా నిలిచాడు బెయిర్ స్టో. ఇక ఈమ్యాచ్ లో ధోని ఆడకపోవడం కూడా చెన్నై అభిమానులను కొంత నిరాశ పరిచింది. మొత్తం 9మ్యాచ్ లు ఆడిన చెన్నై 7మ్యాచ్ లలో విజయం సాధించగా..రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయ్యింది.

- Advertisement -