రెండో దశ పోలింగ్ ప్రారంభం..

147
polling

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తమిళనాడు-38, కర్ణాటక-14, మహారాష్ట్ర-10, ఉత్తరప్రదేశ్-8, అసోం, బిహార్, ఒడిశాల్లో 5 సీట్ల చొప్పున, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో 3 సీట్ల చొప్పున, జమ్ముకశ్మీర్‌లో 2 సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిలో ఒక్కో సీటుకు పోలింగ్ జరుగుతుంది.

అంతేకాకుండా ఒడిశాలో 35 శాసనసభ స్థానాలకు, తమిళనాడులో ఖాళీగా ఉన్నవాటిలో 18 శాసనసభ స్థానాలకూ, పుదుచ్చేరిలో ఒక శాసనసభ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్‌ జరుగుతోంది. రెండో దశలో మొత్తం 1,611 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చాలా మంది సినిమా సెలబ్రెటీలు బరిలో ఉన్నారు.