కీలకమ్యాచ్ లో ఆర్సీబీపై హైదరాబాద్ గెలుపు..

165
hyd
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ చేతులేత్తేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీపై అన్నిరంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ విజయం సాధించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 14.1 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 121 పరుగులు చేసి 5 వికెట్లతేడాతో గెలుపొందింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్ 8 పరుగులకే ఔటైనా తర్వాత వచ్చినా మనీశ్ పాండే ధాటిగా ఆడాడు. 3 పోర్లు,ఒక సిక్స్‌తో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. మనీశ్‌ ఔటైనా సాహా 32 బంతుల్లో 4 ఫోర్లు,ఒక సిక్స్‌తో 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరలో హోల్డర్ 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు.

అంతకముందు టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. సందీప్‌ శర్మ(2/20), జేసన్‌ హోల్డర్‌(2/27) ధాటికి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లకు 120 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోష్‌ ఫిలిప్‌(32), ఏబీ డివిలియర్స్‌(24),వాషింగ్టన్‌ సుందర్‌(21) మాత్రమే ఫర్వాలేదనిపించారు. దేవదత్‌ పడిక్కల్‌(5), విరాట్‌ కోహ్లీ(7) విఫలమయ్యారు.

- Advertisement -