పంజాబ్‌పై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ…

249
srh
- Advertisement -

దుబాయ్ వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 16.5 ఓవర్లలో పరుగులకు 132 ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రాహుల్ 11,అగర్వాల్ 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగగా తర్వాత వచ్చిన సింగ్ 11,మ్యాక్స్‌ వెల్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.

ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు నికోలస్ పురాన్‌ మాత్రం పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 50ని నమోదుచేశాడు. కేవలం 17 బంతుల్లో 6 సిక్స్‌లు,2 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 7 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3,ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 201 పరుగులు చేసింది.హైదరాబాద్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వార్నర్ 52 పరుగులు చేయగా మరో ఓపెనర్ బెయిర్ స్టో తృటిలో సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. 55 బంతుల్లో 6 సిక్స్‌లు,7 ఫోర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వీరిద్దరూ ఔటైన వెంటనే తర్వాత వచ్చిన మనీశ్ పాండే 1,ప్రయాగ్‌ 0,సమద్ 8 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు. చివరలో అభిషేక్ శర్మ 12,విలియమ్ సన్ 20 పరుగులు చేయడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్క్

- Advertisement -