హైదరాబాద్ పై పంజాబ్ ఘనవిజయం..

118
kxip

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఘన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌటైంది. చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు చేయాల్సి ఉండగా 4 పరుగులే చేయడంతో 12 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 35 పరుగులు చేయగా బెయిర్ స్టో 19 పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత వచ్చిన మనీశ్‌ పాండే 15,సమద్ 7,విజయ్ శంకర్ 26,హోల్డర్ 5,రషీద్ ఖాన్ 0 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు.

అంతకముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌…పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌(32 నాటౌట్:‌ 28 బంతుల్లో 2ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌(27), క్రిస్‌ గేల్‌(20) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఆఖర్లో పూరన్‌ రాణించడంతో అమాత్రం స్కోరైనా చేయగలిగింది పంజాబ్‌. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ(2/29), జేసన్‌ హోల్డర్‌(2/27), రషీద్‌ ఖాన్‌(2/14) తలో రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను దెబ్బతీశారు.