రోగ్‌ స్టేజ్‌ పై సన్ని స్టెప్పులు…!

470
Sunny Leone to dance at Rogue Audio Release
- Advertisement -

దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ‘రోగ్‌’ హిట్‌ అవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్‌. ఇజం మూవీ అనుకున్నంత రెంజ్‌కి  అందుకోకపోడమే ఇందుకు కారణం. కాబట్టి పూరికి అర్జెంట్‌ గా ఓ హిట్‌ కావాలి. రోగ్‌ తో మళ్ళీ తన మార్క్‌ని మరోసారి ప్రేక్షకులకు చూపించాలి పూరి. అందుకే రోగ్‌ విషయంలో పూరి చాలా బిన్నంగా ఆలోచిస్తున్నాడు.

అయితే రోగ్‌ లోని కంటెంట్‌ ని పబ్లిసిటీలో కొత్తగా వాడుకోవాలనుకుంటున్నాడు పూరి. ఇప్పటికే రోగ్ టీజర్‌ లో కిస్సులు.. రొమాన్స్ ను విపరీతంగా దట్టించి యూత్‌ మతి పోగొడుతున్నాడు. ఈ టీజర్‌ తో ‘రోగ్‌’ ని తప్పకుండా చూడాల్సిందే..అనే క్యూరియసిటీని పెంచేశాడు. టీజర్‌ తో ఆశ్చర్యపరిచిన పూరి ఇప్పుడు రోగ్‌ ఆడియో వేడుకల్లో కూడా హీట్‌ పుట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అందుకే…రోగ్‌ ఆడియో వేడుకలో కత్తిలాంటి ఫిగర్‌ ని దింపేస్తున్నాడు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమం కోసం ఏకంగా మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ సన్ని లియోన్ ను తీసుకొచ్చేస్తున్నాడు. ఈ హాట్ భామను ఆడియో వేడుకలో చిందులేయాల్సిందిగా(డాన్స్‌) కోరాడట పూరి. అందుకు సన్ని కూడా సై అందట. కానీ.. ఈ భామ భారీ మొత్తంలోనే డిమాండ్ చేసినట్లు టాక్. అయితే ఆమె అడిగిన మొత్తాన్ని పూరి ఇచ్చేందుకు సిద్దమవడంతో.. సన్ని కూడా స్టేజ్ పై డ్యాన్సులు వేసేందుకు సై అనేసింది.

 Sunny Leone to dance at Rogue Audio Release

దీంతో రోగ్ ఆడియో వేడుకలో సన్ని అందాల విందు ఖాయమైపోయింది.  రోగ్‌ తో షాక్‌ లు ఇవ్వడానికి ఇప్పటికే మన్నారా చోప్రా.. ఏంజెలాతో ఆన్ స్క్రీన్ ను వేడెక్కించేలా ట్రై చేస్తున్నాడు పూరి. ఇక పూరికి తోడు ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ను హీట్‌ పుట్టించేందుకు వస్తుంది సన్ని లియోన్. మరి ఈ ‘మరో చంటి గాడి ప్రేమకథ’ లో  పూరి ఇంకెన్ని సిత్రాలు చేశాడో చూడాలి.

- Advertisement -