టాలీవుడ్‌లోనూ.. సన్నీ జోరు..!

302
Sunny Leone Hot Debut In Telugu Movie
- Advertisement -

పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సన్నీలియోన్‌..ఇప్పుడు మళ్ళీ తన హాట్‌ హాట్‌ అందాలతో హీట్‌ పుట్టించడానికి రెడీ అంటోంది. సన్ని అందాలను చూడడానికి ఫ్యాన్స్‌ ఎగబడతారన్న విషయం తెలిసిందే. హాట్‌ హాట్‌ అందాలతో యూత్‌ మతి పోగొట్టే ఈ సుందరి ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్‌ సినిమాలో మెరవడానికి సై అంది. సన్నీ ఇంతకుముందే ‘కరెంటు తీగ’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు టాలీవుడ్‌లో కి సంబంధించిన మరో సినిమాలో ఐటెం సాంగ్‌ చెయ్యడానికి ఒప్పేసుకుందట.

Sunny Leone Hot Debut In Telugu Movie

మరి ఈ అమ్మడికి యూత్ లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెరపై ఆమె కనిపిస్తే చాలు .. థియేటర్స్ లో సందడే సందడి. దాంతో దర్శక నిర్మాతలు తమ సినిమాలో ఆమె కనిపిస్తే చాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు నుంచి కూడా ఆమెకి అవకాశాలు బాగానే వెళుతున్నాయి.మరి ఈ సుందరి ప్రస్తుతం రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘గరుడ వేగ’ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె పల్లెటూరి యువతిగా సందడి చేయనుంది. ఆమెపై ఒక ఐటమ్ సాంగ్ ను కూడా ఇటీవలే చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ సినిమా టీమ్ కూడా ఆమెనే సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘నక్షత్రం’ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ వున్న ఐటమ్ సాంగ్ ను సన్నీతో చేయాలని ప్రయత్నిస్తున్నారట. చూస్తుంటే తెలుగులో సన్నీ జోరు పెరిగేలానే వుంది మరి..!

అయితే గరుడ వేగ సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడించే ప్రయత్నంలో పడ్డాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అందుకే ఈసినిమా కోసం సన్నిని ఎంపిక చేశాడు. ఇక సన్నికూడా సై అనడంతో ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయించాడు ప్రవీణ్. సన్నీ స్టయిల్లోనే చాలా హాట్ హాట్‌గా ఆ సాంగ్ ఉంటుందని సమాచారం. ఇప్పుడు రాజశేఖర్ సినిమాకు సన్ని చిందులేసే ఈ పాటను ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చేయాలని ప్రవీణ్ భావిస్తున్నాడు.

- Advertisement -