నాలుగోసారి మెదక్‌ బీఆర్ఎస్‌దే..

23
- Advertisement -

మెదక్ పార్లమెంటు నియోజకవర్గసన్నాహక సమావేశం లో మంచి చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. పార్లమెంటు నియోజక వర్గ పరిధి లోని ఆరు అసెంబ్లీ సీట్లు గెలిచామన్నారు. మొత్తం ఏడు నియోజక వర్గాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలు మంచి సూచనలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లో కష్టపడి పని చేస్తామని కార్యకర్తలు భరోసా ఇచ్చారన్నారు. కేటీఆర్ ,హరీష్ రావు ల ప్రసంగాలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయన్నారు.

కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను సమావేశం లో ప్రస్తావించారన్నారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని అండగా ఉంటామని అగ్రనేతలు హామీ ఇచ్చారుని…..కాంగ్రెస్ అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిందన్నారు. .బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల కు అడుగడుగునా ప్రొటో కాల్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు మా పైన అధికారిక కార్యక్రమాల్లో పెత్తనం చేస్తున్నారు..అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు.

కేసీఆర్ ప్రభుత్వ హయం లో మంజూరైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలని చూస్తోందని, ఆపిన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. కేసీఆర్ అభ్యర్థి ఎవరిని ఖరారు చేసినా మెదక్ లోక్ సభ స్థానాన్ని నాలుగో సారి కైవసం చేసుకుంటాం అన్నారు.

Also Read:పిక్ టాక్ : టైట్ ఫిట్ లో కవ్విస్తోన్న గాయత్రి

- Advertisement -