Harishrao:కాంగ్రెస్ పాలన అంటే కన్నీళ్లే

19
- Advertisement -

కాంగ్రెస్ పాలన అంటే కన్నీళ్లే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.మెదక్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థి అభ్యర్థికి మద్దతుగా మెదక్‌ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన హరీష్‌..అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లు తెలంగాణ ప్రజల పరిస్థితి అయిందన్నారు.

కాంగ్రెస్‌ హామీలు నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు…ఒకసారి మోసపోతేనే హరిగోస పడుతున్నాం..మళ్లీమళ్లీ మోసపోతారా? ఆలోచించాలన్నారు. నమ్మి ఓటేస్తే కాంగ్రెస్‌ వాళ్లు నట్టేట ముంచారరని… డిసెంబర్‌ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పటికీ దిక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి రైతులను గాలికి వదిలేసిండని.. వందరోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్‌ మోసం చేశాడన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో నీళ్లు తగ్గి కన్నీళ్లు పెరిగాయని.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుధ్ది చెప్పాలని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే వాళ్ల అబద్ధాలను ఆమోదించినట్లేనన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అసెంబ్లీలో మంత్రి భట్టి అబద్ధాలాడరన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన 30వేల ఉద్యోగాలకు రేవంత్‌ నియామకపత్రాలు ఇచ్చారన్నారు. పదేళ్లలో సామాన్యులకు బీజేపీ చేసిందేమీ లేదని…. బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్‌, అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -