దాదాపు 9 నెలల తర్వాత భూమిపై అడుగుపెట్టారు సునీతా విలియమ్స్. ఇక భూమిపైకి వచ్చిన 12 రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు సునీతా విలియమ్స్. మళ్లీ స్టార్‌లైనర్‌లోనే అంతరిక్ష కేంద్రానికి వెళ్తానని చెప్పారు సునీతా.
అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తామని, అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని అన్నారు. అయితే అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే మూడు మైళ్లు పరుగెత్తానని తెలిపారు. అయితే, అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయని, అందుకు తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు అవసరమన్నారు.
Also Read:హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు..అప్‌డేట్
తమకు నాసాపై ఎంతో నమ్మకముందని.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని విల్మోర్ అన్నారు. ఇక స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను కొనియాడారు.