తెలుగు చిత్ర పరిశ్రమలో తన కామిడీతో నవ్వులు పూయించాడు నటుడు సునీల్. కెరీర్ ఆరంభం నుంచే కామెడీ పాత్రలకు పెద్దపీట వేస్తూ… తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. అయితే ఆయన కమెడియన్‌గా బిజీగా ఉన్న సమయంలో హీరోగా అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సునీల్ ఇక కమెడియన్ పాత్రలకు గుడ్ బై చెప్పి.. హీరోగా కంటిన్యూ అయ్యారు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన రెండు మూడు సినిమాలు మినహా మిగతా సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
ఒక్క హిట్ కోసం చాలా రోజులు ఎదురు చూసినా.. ఫలితం లేకపోయింది. వరుస అపజయాలు ఆయనను పలకరించడంతో.. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఈ నేపథ్యంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. వరుసగా మూడు ఆఫర్లతో కమెడియన్‌గా ఫుల్ బిజీగా మారాడు. త్రివిక్రమ్, శ్రీనువైట్ల, హనురాఘవపూడి సినిమాల్లో అవకాశాలు కొట్టేశాడు. అవకాశాలకు తగ్గట్టుగానే.. ఆయన పారితోషకం తీసుకుంటున్నారు. ఒక్కరోజుకు రూ.4 లక్షలు పారితోషకం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.
మరోవైపు బ్రహ్మానందానికి అవకాశాలు తగ్గడం.. వెన్నెల కిషోర్ మినహా ప్రేక్షకులను మిగతా కమెడిన్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సునీల్‌కు కలిసొచ్చిందని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. హీరోగా చేసి.. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతోన్న సునీల్ తన కామెడీతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. ఇక సునీల్‌కు హీరో పాత్రల కంటే కమెడియన్ పాత్రలే మంచి గుర్తింపు తీసుకొచ్చాయని చెప్పాలి.