“పడి పడి లేచే మనసు”లో సునిల్

224
- Advertisement -

చిత్రం “పడి పడి లేచే మనసు”. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ వంటి సెన్సిబుల్ ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ & క్రియేటివ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నారు. ఇటీవలే విడుదలైన శర్వానంద్, సాయి పల్లవిల ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది.

Sunil to play key role in Sharwanand’s Padi Padi Leche Manasu

ఈ చిత్రం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. కామెడీ హీరో సునిల్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు. నేటి నుండి షూటింగ్ లో పాల్గొంటారు. శర్వానంద్, సాయి పల్లవి, సునిల్ మరియు వెన్నెల కిషోర్ ల పై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, జయకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి.

Sunil to play key role in Sharwanand’s Padi Padi Leche Manasu

తారాగణం: శర్వానంద్, సాయిపల్లవి, సునిల్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, ప్రియారామన్, కళ్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, ఫైట్స్: వెంకట్, అంబు-అరివ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం” జయకృష్ణ గుమ్మడి, నిర్మాణం: శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి, దర్శకత్వం: హను రాఘవపూడి.

- Advertisement -