‘రాయన్’..అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది: సందీప్ కిషన్

15
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీ ‘రాయన్’కి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో హీరో సందీప్ కిషన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఇప్పటికే మీరు కొన్ని తమిళ సినిమాలు చేశారు కదా.. కానీ రాయన్ గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు.. కారణం ?

– తమిళ్ లో నాకు నచ్చిన కథలు, ఇంట్రస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ తో పని చేశాను. ధనుష్ అన్నతో కెప్టన్ మిల్లర్, ఇప్పుడు రాయన్ బిగ్గర్ సెటప్ వున్న కాంబో ఫిలిమ్స్. ఇందులో నా కాంట్రిబ్యుషన్ చాలా గ్రేట్ గా వుంటుంది. ఇలాంటి క్యారెక్టర్ చాలా రేర్. ఇది నా కెరీర్ గుర్తుండిపోయే క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ గా నిలిస్తుంది.

ఇందులో మీ పాత్ర ఏమిటి ?

-అసలు చెప్పకూడదు. (నవ్వుతూ) అది స్క్రీన్ పైనే చూడాలి. నా క్యారెక్టర్ కి వున్న వెయిటేజీ గురించి చెప్పాలంటే- ధనుష్ అన్న తన కోసం రాసుకున్న క్యారెక్టర్ ని నాకు ఇచ్చారు. ఇదే ఒక బెస్ట్ కాంప్లీమెంట్ గా భావించాను. ఇప్పటివరకూ నేను చేయని క్యారెక్టర్. నా పెర్ఫార్మెన్స్ కి చాలా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. క్యారెక్టర్ ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. ఎమోషనల్ యాంగిల్స్ కూడా చాలా ఎక్కువ వుంటాయి. యాక్షన్ కూడా వుంటుంది. క్యారెక్టర్ సీరియస్ గా వుంటుంది చూసినపుడు ఫన్నీ గా అనిపిస్తుంది. చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నాను.

ట్రైలర్ చూస్తే అంతా ఫ్యామిలీలా వుంది. కథ ఎలా వుంటుంది ?

-కథ గురించి ఇప్పుడు ఏ మాత్రం చెప్పకూడదండీ. ఇన్ఫాక్ట్.. ధనుష్ పెద్దన్న, నేను రెండో వాడిని, మూడో వాడు కాళిదాస్, ఒక చెల్లి. ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించే కథ. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంటుంది, ప్రతి క్యారెక్టర్ కి ఐడెంటిటీ వుంటుంది.

రాయన్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది ? ధనుష్ గారి డైరెక్షన్ లో యాక్ట్ చేయడం ఎలా ఫీలయ్యారు ?

– తీయడానికి చాలా టఫ్ ఫిల్మ్ ఇది. తొంబై రోజులు షూటింగ్, నేను 75 రోజులు చేశా. నాకొక టఫ్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్. యాక్షన్ సీన్ లో సోల్డర్ ఇంజురీ కూడా అయ్యింది. గ్రీజ్ పూసుకుని సెట్ కి వెళ్ళేవాడిని.(నవ్వుతూ) దాదాపు ఇరవై కిలోమీటర్ల సెట్ లో వేరే వేరే లోకేషన్స్ లో షూటింగ్ జరిగేది. ఇది చాలా కొత్త ఎక్స్ పీరియన్స్, ధనుష్ అన్న కూడా డైరెక్టర్ గా వెరీ టఫ్. కృష్ణవంశీ, దేవాకట్టా, రాజ్ డీకే లతో ఎలాంటి ఒక ఎక్స్ పీరియన్స్ ఫీలయ్యాని రాయన్ కూడా అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. యాక్టర్ గా నేర్చుకోవడానికి చాలా స్కోప్ దొరికింది. నేను కానీ అపర్ణ కానీ ఇందులో ఎవరైనా ధనుష్ అన్న విజన్ కి తగ్గట్టుగా పని చేశాం. ధనుష్ గారి డైరెక్షన్ చేయడం అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

రాయన్ టైటిల్ పెట్టడానికి కారణం ?
-ఇందులో మా ఇంటి పేరు రాయన్. తెలుగు సౌండింగ్ ఉండేలా ఏదైనా టైటిల్ వుంటే బావుంటుదా అని ధనుష్ గారిని అడిగాను. ఇది నార్త్ మద్రాస్ లో జరిగే అంథంటిక్ స్టొరీ. అంథంసిటీ మారిస్తే మ్యాచ్ చేయలేం. నార్త్ మద్రాస్ లో జరిగిన కథని తెలుగు డబ్బింగ్ లో చూడటమే బావుంటుందని అన్నారు. కేజీఎఫ్, తిరు సినిమాలు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో రాయన్ ని కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా సర్ప్రైజింగ్ గా వుంటుంది.

Also Read:BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

పీటర్ హెయిన్స్ మాస్టర్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ?
నా సినిమాల్లో ఫైట్స్ రా గా చేయడానికి ఇష్టపడతాను. ఈ సినిమాలో ఫైట్స్ చాలా యూనిక్ గా వుంటాయి. ప్రతి ఫైట్ కి ఒక స్టొరీ వుంటుంది. పీటర్ మాస్టర్ అద్భుతంగా చేశారు.

రెహ్మాన్ గారితో పని చేసే అవకాశం రావడం ఎలా అనిపించింది ?
– చాలా ఆనందంగా వుంది. నాకు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ కి ఫేవరేట్ సాంగ్ అవుతుంది. అలాగే పీచు మిటాయి, ఓ రాయన్ సాంగ్ కూడా నాకు చాలా నచ్చాయి.

మీరు కీ రోల్స్ లో తమిళ్ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉందా?
లేదండీ. ఇది కూడా చేసేవాడిని కాదు. ధనుష్ అన్న డైరెక్షన్, ఆయన యాభైవ సినిమా. కథ విన్నాక షాక్ అయ్యాను. చాలా నచ్చింది. అందుకే చేశాను.

సన్ పిక్చర్స్ మేకర్స్ గురించి ?
-సన్ పిక్చర్స్ గ్రేట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్. వారితో కలసి పని చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.

ధనుష్ గారి సినిమాల్లో రిమేక్ చేయాలని అనుకుంటే ఏ సినిమాలు చేస్తారు ?
-పుదుపేట్టై. రఘువరుణ్ బీటెక్ రిమేక్ చేయడానికి ప్రయత్నించాం కానీ చివరి నిమిషంలో కుదరలేదు.

ధనుష్, సెల్వరాఘవన్ బాండింగ్ ఎలా వుంటుంది ?
-చాలా క్యూట్ గా వుంటారు. సెల్వరాఘవన్ గారికి కూడా ముఫ్ఫై టేకులు తీసుకుంటారు (నవ్వుతూ). చాలా స్వీట్ పీపుల్. సినిమా విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా వుంటారు.

మీ బ్యానర్ లో కొత్త సినిమాలు గురించి ?
వెంకటాద్రి టాకీస్ లో మూడు సినిమాలు చేశాం, మూడు సినిమాలు వర్క్ అవుట్ అయ్యాయి. మంచి పేరు వచ్చింది. బయట వాళ్ళతో సినిమాలు నిర్మించాలనే బ్యానర్ పెట్టాను. తర్వలోనే కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ మెంట్ వుంటుంది.

భైరవ కోనకి సీక్వెల్ ఉంటుందా ?
భైరవకోన కి వచ్చిన రెస్పాన్స్, సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సీక్వెల్ తప్పకుండా చేస్తాం.

కొత్త సినిమాల గురించి ?
నక్కిన త్రినాధ రావు గారితో ఒక సినిమా జరుగుతోంది. ఇది నా 30వ సినిమా. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అలాగే మయావన్ సినిమా కూడా జరుగుతోంది. ఇది సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో టైప్ సినిమా. అలాగే రాహుల్, స్వరూప్ తో వైబ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది.

- Advertisement -