అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తికి వందనం అంటూ గుడ్ న్యూస్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని పెద్దల సభకు నామినేట్ చేశారు.
సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషకరమైన విషయమన్నారు మోడీ. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని… విద్య సహా విభిన్న రంగాలకు సుధా చేసిన కృషి అపారమైందన్నారు. ఇదో కొత్త బాధ్యతగా భావిస్తున్నా.. రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం కొత్త బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.
Also Read:Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభ సభ్యురాలిగా నియమించ బడ్డారు సుధా మూర్తి. ప్రధాని మోడీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించగా రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రచయిత్రిగా, సంఘ సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు పద్మశ్రీ సుధా మూర్తి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ , గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరించారు.
కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడ్డారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంచించారు. తన వృత్తి జీవితంతో బాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేస్తారు. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే (డాలర్ కోడలు) ఆంగ్లములో డాలర్ బహుగా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది.