బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ దుస్తువులను బీజెపీ మంత్రులు ధరించకుండా నిషేధం విధించాలని, అంతేకాకుండా మద్యాన్ని కూడా ముట్టుకోకూడదని అన్నారు. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ చర్యలను అమలుచేయాలని సూచించారు.
పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులను ధరించడమంటే… విదేశీ బానిసత్వానికి లొంగిపోవడమేనని అన్నారు. మన వాతావరణానికి అనుకూలమైన దుస్తులను ధరించేలా బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 మద్య నిషేధాన్ని సూచిస్తోందని… దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను అనడంలేదని, కాకపోతే క్రమశిక్షణలో దీన్ని కూడా భాగం చేసుకోవాలని సూచిస్తున్నానని చెప్పారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంత్యుత్సవాల్లో ఎన్డీయే మంత్రులు పాల్గొనలేదని ట్విట్టర్ ద్వారా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మంత్రుల దుస్తుల గురించి ఆయన మాట్లాడారు.