వందే భారత్‌లో ఓవైసీ..రాళ్ల దాడి

241
owaisi
- Advertisement -

మజ్లిస్ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాద్ నుండి సూరత్‌కి వెళ్తున్న రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇత‌ర పార్టీ నేత‌లు కూర్చున్న బోగీపై రాళ్లు విసరడంతో బోగీలోని అద్దాలు ధ్వంసం అయ్యాయి. సూర‌త్‌కు 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

గతంలోనూ పలుమార్లు ఓవైసీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా టోల్ ప్లాజా దగ్గర ఓవైసీపై దుండగులు కాల్పులు జరపగా సురక్షితంగా బయటపడ్డారు. ఇక 2020లోనూ ఓవైసీపై దుండగులు కాల్పులు జరిపారు. యూపీలోని మీరట్‌లో ఈ ఘటన జరుగగా ఈ కేసులో దుండగుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -