నిజాం కాలేజ్‌ విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్

229
- Advertisement -

నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళనపై స్పందించారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యకు త్వరగా ముగింపు పలకాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. విద్యార్థులకు అండగా నిలిచిన కేటీఆర్…ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని పేర్కొన్నారు.

ktr

యూజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించాలని నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థులకు కాకుండా పీజీ స్టూడెంట్స్ కు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. తమకు హాస్టల్ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆందోళనపై స్పందించారు కేటీఆర్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -