బాల్ ట్యాంపరింగ్‌..స్మిత్‌పై బ్యాన్‌ ఎత్తివేత!

234
David Warner Steve Smith
- Advertisement -

బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్,డేవిడ్ వార్నర్,బ్యాన్‌ క్రాఫ్ట్‌లపై నిషేధం ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈవో కెవిన్ రోబర్ట్స్ వీరిపై నిషేధం ఎత్తివేయాలన్న విన్నపాన్ని స్వీకరించింది. కొంతకాలంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు గడ్డుకాలం నడుస్తోందని ఈ నేపథ్యంలోనే సీనియర్ ఆటగాళ్లైన ఈ ముగ్గురిపై నిషేధాన్ని ఎత్తివేసే అంశంపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.

బాల్ ట్యాంపరింగ్‌ వివాదంతో ఈ ముగ్గురు జట్టుకు దూరమైనప్పటి నుంచి ఆస్ట్రేలియా ఆటతీరు పేలవంగా మారిపోయింది. టీమ్ పైన్ సారథ్యంలో వరుసగా టెస్టులను ఓడిపోతోంది ఆసీస్‌.

ఇక ఆరోన్ ఫించ్ సారథ్యంలోని వన్డే జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంది. ఇటీవల వరుసగా ఏడు వన్డేల్లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. వీటిలో ఇంగ్లాండ్‌పై 5-0 తేడాతో వైట్‌వాష్ ఒకటి కాగా, పాకిస్థాన్‌పై రెండు వన్డే మ్యాచ్‌ల్లో ఓటమి మరొకటి.

ఈ నేపథ్యంలో స్మిత్,వార్నర్,బ్యాన్‌ క్రాఫ్ట్‌లపై నిషేదం ఎత్తివేత అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఏ సీఈవో వెల్లడించారు.

- Advertisement -