అవకాశాలు తగ్గలేదు..తగ్గించుకున్నాను..!

247
hansika
- Advertisement -

దేశ ముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చెన్నయ్ సోయగం హన్సిక మొత్వాని. తొలి సినిమాతోనే కుర్ర కారును కట్టిపడేసింది హన్సిక. ఈ సినిమా తర్వాత హన్సిక పేరు మార్మ్రోగిపోయింది. అవకాశాలు కూడా అలానే వచ్చాయి. ఈ క్రమంలో టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన హన్సిక కొద్ది కాలం తర్వాత కోలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతోంది.

ఈ నేపథ్యంలో స్పందించిన హన్సిక తనకు తానుగానే సినిమాలు తగ్గించుకున్నానని తనపై వస్తున్న రూమర్లలో నిజం లేదని తెలిపారు. ఇటీవల చాలా సినిమాలు వదిలేశాను, గ్లామర్ పాత్రలు చాలా చేశాను కాబట్టి, ఇప్పుడు వాటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. అభినయానికి ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తాను తెలిపారు హన్సిక.

సినిమా షూటింగ్‌లకు తాను కరెక్ట్ టైమ్‌కు వస్తానని… షెడ్యూల్‌కంటే పదినిమిషాల ముందే సెట్స్‌కు వస్తానని తెలిపారు. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకుని వారి పోష‌ణ చూస్తూ సామాజిక బాధ్య‌త‌లోనూ పై స్థాయిలో ఉందీ ఈ భామ‌. తెలుగులో ఇటీవల ‘గౌతమ్‌నంద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతగా ఆకట్టుకోలేక పోయింది.

- Advertisement -