‘పద్మావత్‌’ను ఆపలేరు..!

247
- Advertisement -

పద్మావత్ సినిమాకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో విడుదల చేసుకోవచ్చని ఆదేశించింది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయలేమని ఇవాళ కోర్టు మళ్లీ స్పష్టం చేసింది. ఆయా రాష్ర్టాలు ఆ ఫిల్మ్‌ను ప్రదర్శించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. శాంతిభద్రత సమస్యలు ఉత్పన్నమయ్యే నేపథ్యంలో పద్మావత్‌ను రద్దును చేయాలని రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఈరకంగా స్పందించింది. దీనికి బదులుగా సినిమా చూడవద్దు అని ప్రజలకు సలహా ఇవ్వాలంటూ కోర్టు తన తీర్పులో ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

All States To Show Padmaavat Movie

పద్మావత్‌ను వ్యతిరేకిస్తున్న కర్ణిసేనకు కూడా ఈ విషయాన్ని చేరవేయాలంటూ కోర్టు తెలిపింది. సినిమా రిలీజ్‌కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరీ ఉత్కంఠంగా మారింది. రాజ్‌పుత్ సంఘాల బెదిరింపుల నేపథ్యంలో ఈ సినిమాను బ్యాన్ చేయాలని గుజరాత్, హర్యానా, రాజస్థౠన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి.

- Advertisement -