దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి2 తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ప్రస్తుతం స్ర్కీప్ట్ ను చక్కదిద్దే పనిలో ఉన్నాడని సమాచారం. సంక్రాంతి నుంచి ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభవనుందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
అయితే రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో బిజీగా ఉండటంతో షూటింగ్ ను సంక్రాంతి నుంచి ప్రారంభించనున్నారు. నవంబరు 11న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈవేడుకకు రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరుకుకానున్నారని తెలుస్తుంది. ఈసినిమా టైటిల్ గురించి టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. ‘RRR’ (వర్కింగ్ టైటిల్) అంటే అందరూ అనుకుంటున్నట్లు రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్ మాత్రమే కాదు.
అసలు టైటిల్‘రామ రావణ రాజ్యం’ అని టాక్ వినిపిస్తోంది. అయితే దినికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. సినిమా ప్రాంరభోవత్సవం రోజు అధికారికంగా టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు సినీ వర్గాలు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. కిరవాణి సంగీతం అందించనున్నారు.