తెలంగాణ ఎన్నికల్లో పోటీపై పవన్‌ ప్రకటన..

226
Pawan Kalyan
- Advertisement -

షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 25 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామని… ఇదే విధంగా మూడు పార్లమెంటు స్థానాల్లో కూడా బరిలోకి దిగాలనుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రెండుమూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జనసేన పవన్‌ అన్నారు.

Pawan Kalyan

ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు పవన్. అయితే కొంత మంది స్వతంత్రంగా నిలబడతామని.. తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారని పవన్‌ చెప్పగా.. వీటన్నింటిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -