ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ1 .. ప్రయోగం విజయవంతం

109
sslv
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) మొదటి లాంచ్‌ప్యాడ్‌ నుంచి ఉదయం 9.18 గంటలకు రాకెన్‌ ప్రయోగించింది. కేవలం 13.2 నిమిషాల్లోనే ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న SSLV-D1 వాహక నౌక.. ఈఓఎస్‌-02, ఆజాదీ శాట్‌ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. తక్కువ ఎత్తులోని సమీప భూకక్ష్యలోకి వాటిని ప్రవేశపెట్టింది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేశారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేశారు.

ఇక నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్‌- 2ఏ (ఈఓఎస్‌శాట్‌)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెట్టింది. తనంతరం ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టింది.

- Advertisement -