జీఎస్ఎల్వీ ఎఫ్ 14 … గ్రాండ్ సక్సెస్

12
- Advertisement -

ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం సక్సెస్ అయింది. వాతావరణాన్ని అంచనా వేయడంతో పాటు విపత్తు నిర్వహణకు సేవలు వాడుకునేందుకు ఇస్రో చేపట్టిన 3డీఎస్ ఉపగ్రహాం విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీఎఫ్‌ 14 సక్సెస్ అయిందని ఛైర్మన్ సోమనాథ్‌ తెలిపారు.

సాయంత్రం 5.35 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 27.5 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగింది. జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. ఈ ఉపగ్రహ బరువు 2,275 కిలోలు. భారత వాతావరణ శాఖ ప్రయోజనాల కోసం ఇన్ శాట్ 3 DS ఉపగ్రహం ప్రయోగిస్తున్నట్లు తెలిపారు సోమనాథ్‌.

Also Read:‘బ్లాక్ టీ’తో ఉపయోగాలు..

- Advertisement -