- Advertisement -
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 5 గురు మృతదేహాలను వెలికితీశారు. 9 మంది మంటల్లో చిక్కుకుపోగా మరో నలుగురికోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
మృతదేహాలను వెలికితీసిన వారిలో ఒకరు ఏఈ సుందర్ నాయక్(35)గా గుర్తించారు. మిగితా నలుగురిని గుర్తించ పనిలో ఉన్నారు.మృతుడు సుందర్ నాయక్‌ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన తండా. భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనాను జయించిన సుందర్ తాజాగా అగ్నికి ఆహుతయ్యారు.
- Advertisement -