ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి 2,26,361 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ 5గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,39,685 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 63,083 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా….శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 884.70 అడుగులకు నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా…. ప్రస్తుతం 213.88 టీఎంసీలు నీరు ప్రాజెక్ట్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం 5 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.
నిండుకుండలా శ్రీశైలం…
- Advertisement -
- Advertisement -