నాన్సీ పెలోసీపై అంక్షలు విధించిన చైనా…

49
nancy
- Advertisement -

అమెరికా ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసీకి డ్రాగన్‌ కంట్రీ చైనా ఆంక్షలు విధించింది. ఈ పర్యటనను తీవ్రంగా ఖండించిన చైనా.. ఇది కచ్చితంగా తమను రెచ్చగొట్టేందుకే అని మండిపడింది.

చైనా ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా కూడా పెలోసీ మాత్రం తైవాన్‌ సందర్శనకు వచ్చారు. ఇది కేవలం చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా.. దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే అంశం. అలాగే తైవాన్ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఈ పర్యటన ఉందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే నాన్సీ పెలోసీతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

జపాన్‌ పర్యటనలో ఉన్న నాన్సీ పెలోసీ టోక్యోలో విలేకరులతో మాట్లాడారు. తైవాన్‌ను ఒంటరి చేయాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మమ్మల్ని అక్కడకు వెళ్లకుండా అడ్డుకోలేరు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలన్నదే మా ప్రయత్నం అని పెలోసీ చెప్పుకొచ్చారు. మరోవైపు పెలోసీ పర్యటనకు నిరసనగా ఇప్పటికే చైనా తైవాన్‌ సమీపంలో భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ యుద్ద విన్యాసాలను అమెరికా ఖండించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ వీటిని కవ్వింపు చర్యలుగా అభివర్ణించారు.

- Advertisement -