శ్రీశైలం 5 గేట్లు ఎత్తివేత…

112
srisailam

శ్రీశైలం జలాశయానికి వరద ఇన్‌ ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుండి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుండటంతో 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు.నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 587.60 అడుగులు. సాగర్‌ నీటి మట్టం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.14 టీఎంసీల నీరుంది.