పెరిగిన బంగారం ధరలు..!

225
gold rate

బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా దేశీయ మార్కెట్‌లలో పెరగడం విశేషం. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరిగి రూ.49,250కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.53,720కు చేరాయి.

బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండిపై రూ.660 పెరిగి రూ.68,560కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదలతో 1955 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.85 శాతం తగ్గుదలతో 27.05 డాలర్లకు చేరింది.