జంట నగరాల పరిధిలో శ్రీరామనవమి సందర్భంగా వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. జంట నగరాల్లో శోభాయాత్ర ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైన్స్ బంద్ కానున్నాయి. 30వ తేదీ ఉదయం 6 గంటల నుండి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు.
వైన్ షాపులతో పాటు బార్లు, క్లబ్‌లు, పబ్బులు, ఫైవ్‌స్టార్ హోటళ్లలోని బార్ రూమ్‌లను కూడా క్లోజ్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా శ్రీరామనవమి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మద్యం షాపులను మూసివేయించనున్నట్లు తెలిపారు.
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి వైన్ షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అలాగే బ్లాక్ మార్కెట్లో కూడా మద్యం విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..