బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు శ్రీరామచంద్ర. మానస్‌తో జరిగిన పోరులో శ్రీరామచంద్ర విజేతగా నిలిచి సత్తాచాటాడు. ఇక టికెట్ టు ఫినాలే నాలుగో ఛాలెంట్‌లో భాగంగా.. ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఫోకస్ గేమ్‌ని ఎంచుకుని బ్లూ కలర్ జెండా ఎగరేశాడు సన్నీ. సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్‌లకు ఫోకస్ టాస్క్ ఇవ్వగా నలుగురికి నాలుగు పలకలు ఇచ్చి.. వివిధ రకాల సౌండ్స్ వినిపిస్తాయని .. ఆ సౌండ్స్‌ని విని అవి వేటికి సంబంధించినవో రాయాలని తెలిపాడు. సౌండ్స్ స్టార్ట్ అయిన తరువాత సైగలు చేస్తూ ఉండటంతో సన్నీ కాజల్‌పై సీరియస్ అయ్యాడు. ఇది టికెట్ టు ఫినాలే మాజాక్‌లు చేయకు.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో.. నువ్ చేసేది రాంగ్..అంటూ వాదించగా కాజల్ కూడా వాదించడంతో గొడవ పెద్దదైంది.. చివరకు సన్నీ తన చేతిలోని పలక విసేరయడంతో కాజల్ కాస్త మెత్తబడింది.
ఇక ఈ టాస్క్‌లో ఏడు సీక్వెన్స్‌లను కరెక్ట్‌గా రాసిన మానస్-సన్నీలు విన్ కాగా.. సిరి, శ్రీరామ్‌లు ఈ టాస్క్‌లో వెనకబడ్డారు. అయినప్పటికీ మొత్తం నాలుగు టాస్క్‌ల స్కోర్‌ని బట్టి మానస్ 25 పాయింట్లతో తొలి స్థానంలో ఉంటే.. శ్రీరామ్ 21 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. సిరి 19 పాయింట్లతో మూడో స్థానం.. సన్నీ 17 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు.
ఇక ఐదో ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఆక్యురసీ గేమ్ ఎంచుకున్నారు. దీంతో బిగ్ బాస్ చిన్న ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. బోర్డ్‌పై స్విచ్ఛ్‌లు బల్బ్‌లు ఇచ్చి బజర్ మోగేసరికి ఐదైదు చొప్పున బల్బ్స్ వెలిగించాలని.. తక్కువ టైంలో ఎక్కువ బల్బ్‌లు వెలిగించిన వాళ్లే ఈ టాస్క్‌లో విజేతలుగా నిలుస్తారని చెప్పారు. అయితే శ్రీరామ్, సిరిలు కాళ్లకి కట్లు కట్టుకుని ఉండటంతో వారి ప్లేస్‌లో మరో ఇద్దరు టాస్క్ ఆడొచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఎలాగూ సిరి తరుపున షణ్ముఖ్ రెడీగా ఉంటాడు కాబట్టి.. శ్రీరామ్ తరుపున కూడా షణ్ముఖ్ బరిలో ఉన్నాడు. తొలుత సన్నీ-సిరి ఆడగా సన్నీ విజేతగా నిలిచాడు. తర్వాత మానస్-శ్రీరామచంద్ర ఆడగా శ్రీరామచంద్ర విజేతగా నిలిచాడు.
మొత్తంగా ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి మానస్ 29 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 28 పాయింట్లతో శ్రీరామ్ రెండో స్థానం ఇక చివరి రెండు స్ధానాల్లో ఉన్న సన్నీ-సిరి టికెట్ టు ఫినాలే నుండి తప్పుకున్నారు. ఇక ఫైనల్ టాస్క్‌లో పిల్లర్ టాస్క్ ఇవ్వగా బరువైన బ్యాగ్‌కి తాడు కట్టి.. దాని సాయంతో కింద ఉన్న బ్లేట్స్‌ని ఇరగ్గొట్టుకుంటూ రావాల్సి ఉంది.. అయితే మానస్ బ్యాగ్ కడ్డీలో ఇరుక్కుని పోవడంతో శ్రీరామ్ ఈ టాస్క్‌లో గెలిచి టికెట్ టు ఫినాలే అందుకున్నాడు.