నాగ్‌-నానీ మూవీపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

281
Sriram Aditya Denies Rumours About Nagarjuna-Nani's Film
- Advertisement -

మొదటి నుంచి కూడా నాగార్జున కొత్తదనంతో కూడిన కథలను చేస్తూ వచ్చారు. మల్టీ స్టారర్ మూవీలు చేయడంలోనూ ఆయన ముందుంటూ వచ్చారు. ఇక నాని విషయానికొస్తే అన్నివర్గాల ప్రేక్షకులతో పక్కింటి అబ్బాయి అనిపించుకుని నేచురల్ స్టార్ గా మార్కులు కొట్టేశాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ ను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మూవీ ‘జానీ గద్దర్’ కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.

Sriram Aditya Denies Rumours About Nagarjuna-Nani's Film

అయితే ఈ సనిమాపై వస్తున్న వార్తలపై దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య క్లారిటీ ఇచ్చాడు. నాగ్-నాని సినిమా ఏ చిత్రానికీ రీమేక్ కాదని.. ఇది తన సొంత కథతో తెరకెక్కుతున్న సినిమా అని.. ఇక ఊహాగానాలన్నీ కట్టిపెట్టాలని కోరాడు. తన సినిమా విషయంలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుండటంతో శ్రీరామ్ ఓపెన్ అవ్వక తప్పలేదు. కాబట్టి ఇక అందరూ సైలెంటైపోవచ్చు. ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనుండగా.. నాని డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు.

ఇందులో ‘మళ్ళీరావా’ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ నాగ్ సరసన నటిస్తోంది. నానికి జోడీగా ‘ఛలో’ భామ రష్మిక మందాన్న కనిపిస్తుంది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్నందిస్తాడు. ఇప్పటికే సగం దాకా చిత్రీకరణ పూర్తయిందంటున్నారు. ఈ చిత్రాన్ని వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -