టాలీవుడ్ లో థియోటర్స్ వద్ద ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న మూవీ జయమ్ము నిశ్చయమ్మురా. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయం సాధించే దిశగా ఈ సినిమా దూసుకుపోతొంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలైన తరువాత శ్రీనివాస్ రెడ్డికి మార్కెట్ లో కాస్త బలంగా మారింది. ఇప్పటి వరకూ శ్రీనివాస్ రెడ్డి చేసిన సినిమాలో గీతాంజలి మంచి సక్సెస్ ని సాధించింది. ఆ తరువాత ఇప్పుడు వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా మూవీ శ్రీనివాసరెడ్డికి మంచి గుర్తింపును తీసుకువచ్చింది.
దీంతో కొంత మంది నిర్మాతలు శ్రీనివాస్ రెడ్డి తో సినిమాలు చేస్తే మంచి లాభాలను పొందే అవకాశం ఉందని నిర్ణయించుకున్నారట. అందుకే జయమ్ము నిశ్చయమ్మురా మూవీ చూసిన చాలా మంది చిన్న నిర్మాతలు… శ్రీనివాస్ రెడ్డి ని హీరోగా పెట్టి సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నారట. అందులో భాగంగానే నలుగు ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ రెడ్డి కి అడ్వాన్స్ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యానట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల అన్నింటికి ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యాడట శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఆ నాలుగు చిత్రాలను ఒప్పుకుంటే శ్రీనివాస్ రెడ్డి దాదాపు మరో రెండు సంవత్సరాల పాటు ఎటువంటి కామెడీ రోల్స్ చేయటానికి వీలు ఉండదు. ఓ వైపు కామెడీరోల్స్ చేస్తూనే హీరోగా చేయాలనేది శ్రీనివాస్ రెడ్డికి కోరిక. అందుకే కొత్త ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఆఫర్స్ ని శ్రీనివాస్ రెడ్డి సున్నితంగా తిరస్కరించాడట.
ఇక జయమ్మునిశ్చయమ్మురా మూవీలో తాజాగా 15 నిమిషాల నిడివి తొలగించిన విషయం తెలిసిందే. ఈ విధంగా నిడివి తగ్గించిన తర్వాత కామెడీ ఎపిసోడ్స్ ని, పంచ్ డైలాగ్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తంగా శ్రీనివాస్ రెడ్డి హీరోగా త్వరలోనే మరిన్ని చిత్రాలు వస్తాయని తెలుగుఇండస్ట్రీ భావిస్తుంది. ఇక నుంచి ప్రతి ఏడాదికి తను హీరోగా ఒక సినిమా తీసుకురావాలని శ్రీనివాస్ రెడ్డి నిశ్చయించుకున్నాట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక టాలీవుడ్‌లో కమెడియన్లు కాస్త హీరోలుగా మారిపోతున్నారు. ఇటీవలే మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి కూడా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హీరోగా మారిపోయాడు. కమెడియన్లు హీరోగా మారిపోవడం వల్ల టాలీవుడ్‌లో కమెడియన్ల కొరత ఉంటుందేమో అని అనుకుంటున్నారు సినీ పండితులు.