రాష్ట్రంఓ ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అన్నారు రాష్ట్ర క్రీడా, ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలోని అన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ పార్టీ ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటిలను అభివృద్ది చేసుకుంటున్నామని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ది పధంలో దూసుకుపోతుందన్నారు. కరివేనను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుకొని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. గడిచిన 70ఏండ్లలో కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమి లేదన్నారు. అవినీతికి తావు లేకుండా కొత్త మున్సిపాలిటి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నకల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులు ఘన విజయం సాధిస్తారన్నారు.