మళ్లీ పెళ్లి చేసుకున్న మెగాస్టార్‌ మాజీ అల్లుడు..!

1088
- Advertisement -

సినీ నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను ఆయన వివాహం చేసుకున్నారు. ఇక స‌రిగ్గా ప‌దేళ్ల కింద చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌రిచిపోలేరు. 19 ఏళ్ల శ్రీ‌జ తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్ప‌ట్లో మీడియా కూడా వాళ్ల‌కే స‌పోర్ట్ చేసింది. త‌ను ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోడానికి చాలా సాహ‌సాలే చేసింది శ్రీ‌జ‌.

Srija Ex-Husband Sirish Bharadwaj

అయితే ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో శిరీష్ భరద్వాజ్ నుంచి కొన్నేళ్ల కింద విడిపోయింది చిరు చిన్న కూతురు. విడిపోయిన త‌ర్వాత ప్రముఖ వ్యాపార వేత్త తనయుడు కళ్యాణ్ దేవ్‌ని 2016 మార్చి 28న పెళ్ళి చేసుకుంది. శిరీష్ – శ్రీజ జంటకు ఒక పాప ఉండగా, వారిరువురు విడిపోయిన త‌ర్వాత పాప శ్రీజ ద‌గ్గ‌రే ఉంటోంది. ఈ మ‌ధ్య మ‌రో బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది శ్రీ‌జ‌. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీలో చేరిన శిరీష్‌ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -