రాజన్న సన్నిధిలో రాములోరి కల్యాణం..

400
vemulawada sri rama navami
- Advertisement -

శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం సిద్ధమైంది. ఇవాళ స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకుగాను రాజన్న ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు.

వేదమంత్రాల సాక్షిగా చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్ష త్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు తెలంగాణ 31 జిల్లాల నుండే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి వచ్చిన భక్తులతో వేములవాడ క్షేత్రం జనసంద్రమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

మరోవైపు భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆదివారం అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం సీతారాముల తిరుకల్యాణోత్సవం, సోమవారం శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. రాములోరి కల్యాణం సందర్భంగా విద్యుత్ దీపాల వెలుతురులో ధగధగ మెరిసిపోతోంది భద్రాద్రి. ప్రభుత్వ అధికార లాంచనాల మధ్య జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు,పట్టువస్త్రాలు అందజేయనుండగా పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ దంపతులు హాజరుకానున్నారని సమాచారం.

- Advertisement -