ప్రపంచకప్‌లో శ్రీలంక సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోర ఓటమిని మూటగట్టుకుంది.204 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతు చేధించింది దక్షిణాఫ్రికా.ఓపెనర్ డికాక్(15) త్వరగా ఓటైనా తర్వాత క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్,ఆమ్లా మరో వికెట్ పడకుండా సఫారీలకు విజయాన్ని అందించారు.
ఆమ్లా (80 నాటౌట్; 105 బంతుల్లో 5×4), డు ప్లెసిస్(96 నాటౌట్; 103 బంతుల్లో 10×4, 1×6) అర్ధశతకాలతో రాణించారు. 204 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 37.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.
అవిష్క ఫెర్నాండో (30; 34 బంతుల్లో 4×4), కుశాల్ మెండిస్(30; 29 బంతుల్లో 4×4) , కుశాల్ మెండిస్(23), డి సిల్వా(24) పోరాడినట్లే కనిపించినా.. కీలక సమయంలో ఔట్ అయ్యారు. దీంతో శ్రీలంక 204 పరుగులకు ఆలౌటైంది. సెమీస్‌లో అడుగు పెట్టాలంటే శ్రీలంకలో ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంది. కానీ.. ఈ మ్యాచ్‌లో చేతులెత్తేయడంతో దక్షిణాఫ్రికా సునాయసంగా గెలిచింది. శ్రీలంక సెమీస్‌లో చేరాలంటే వెస్టిండీస్, భారత్‌తో జరిగే మ్యాచుల్లో గెలవాల్సి ఉంది.