టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా..

298
India vs New Zealand

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న టీమిండియా మరో పోరుకు తలపడుతోంది. టీమిండియా ఐదో టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గ‌త రెండు ‘సూపర్‌’ థ్రిల్లర్‌ విజయాలతో కొండంత ఆత్మవిశ్వాసం నింపుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోను గెలిచి వైట్ వాష్ చేయాల‌ని భావిస్తుంది.

ఇక వ‌రుస ప‌రాజయాలు చ‌విచూస్తున్న కివీస్ టీం చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాల‌ని భావిస్తుంది. ఈ మ్యాచ్‌లో భార‌త్‌, న్యూజిలాండ్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్నాయి. కోహ్లీకి ఈ మ్యాచ్‌లో విశ్రాంతినివ్వ‌డంతో భార‌త టీం కెప్టెన్‌గా రోహిత్ ఉన్నారు. రిషభ్‌ పంత్‌కు అవకాశం దక్కుతుందని భావించినా అది జరగలేదు.

తుది జట్లు..

భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, సంజూ శాంసన్‌, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్, చహల్‌, బుమ్రా, సైనీ.

న్యూజిలాండ్‌: టిమ్‌ సౌతీ(కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్, మన్రో, రాస్‌ టేలర్, టామ్‌ బ్రూస్‌, డరైన్‌ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్‌లీన్, సోధి, బెన్నెట్‌.