హ్యాపీ బర్త్ డే…సందీప్ కిషన్

45
- Advertisement -

నటుడిగా,సహాయ దర్శకుడిగా,నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో సత్తా చాటిన సందీప్ కిషన్ బర్త్ డే నేడు. మే 7 1987 న జన్మించారు సందీప్. తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు.

స్నేహగీతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాగా ప్రస్థానం సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్‌ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్నారు. అయితే తన కెరీర్‌లో సరైన హిట్ మాత్రం కొట్టలేదు. ఇటీవల మైఖెల్‌తో వచ్చినా అది బాక్సాఫీస్‌ ముందు బొళ్తా పడింది.

Also Read:జిలేబి షూటింగ్‌ పూర్తి..!

నిను వీడని నీడను నేనే అనే మూవీతో నిర్మాతగా మారారు సందీప్. కెరీర్ బిగినింగ్ నుంచే విభిన్నమైన పాత్రలు వేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మాస్ ఇమేజ్‌ కోసం కమర్షియల్ సినిమాలు చేసినా హిట్ మాత్రం దక్కలేదు. అయితే ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తుండగా వాటితోనైనా హిట్ కొట్టాలని ఆశీద్దాం..

Also Read:31న బ్రాహ్మణ సదనం ప్రారంభం..

- Advertisement -